పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దానికి ప్రవేటు పరీక్ష కూడ ఏర్పాటు చేసి నారు. దీనిని విద్యామంత్రి శాఖవారు చేస్తారు. ఈ పరీక్ష ప్రతి శనివారమున్ను జరుగుతుంది. దీనికి "తెలివి పరీక్ష" (Intelligence Test) అని పేరు. ఈ పరీక్షలో కృతార్దులయిన వారు ఒక విశ్వదిద్యాలయములో చేరవచ్చును.

మెటేరిక్యులేషను పరీక్షకు అభ్ట్యూరియెంటన్ ఎక్జామెన్ (Intdligence Test) తప్ప మరేదిన్ని ప్రయివేటు పరీక్ష లేదు. ప్రతి దినమున్ను విద్యార్తులు చూసిన అభివృద్ధిని బట్టిన్ని, తరగతి ఉపాద్యాయుల రిపోర్టులను బట్టిన్ని పిల్లలను పై క్లాసులలో వేస్తారు.

ఇంగ్లాండు, ప్రాన్సు దేశములలో వలె కాక, జర్మినీ దేశపు ఉన్నత పాఠశాలలన్నీ పగటి పూట ఉండేవె. పై స్థలముల నుంచి వచ్చే విద్యార్థులు గదులను అద్దెలకు తీసుకొని, భోజన సదుపాయ

60