పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/208

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరిగి నిర్మించుకొన్నారు. జర్మను పద్ధతిలో, అన్ని విధములైన విద్యాలయములలోని చదువులోను ఒకటితో ఒకటి సంబంధించి ఉండడము ముఖ్య క్షణము, పద్దతి మొత్తముమీద ఆలోచించి ఏ ర్పరిచినది; దీనిప్రకారము ప్రతివ్య క్తికిన్ని ప్రత్యేకముగా విద్యాశిక్షణము దొరుకుతుంది. వ్యక్తి తానవలంబింపదలచిన వృత్తి నెంచుకొనగానే, అత డెక్కడ ఏపుస్తకములు చదువవ లెనో, ఎట్లు చదువవలెనో సమస్తమున్ను తెలిసియే ఉంటుంది. ఆచదువుకు కావలసిన సౌకర్యములన్నీ అవ్యక్తికి సులభముగా నే లభిస్తవి. ప్రతివ్యక్తికిన్ని కార్మిక విద్యను నిర్బంధముగా నేర్పే దేశము జర్మనీ ఒక్కటే. ఫ్రాన్సు ఈ నిర్బంధ కార్మిక విద్యను గురించి ఎంతో కాలమునుంచిన్ని ఆలోచిస్తున్నది; కాని, జర్మనీ ఈలోగా నిర్బంధ కార్మిక విద్య నవ లంబించి దానిలోని సుక్ష్మాంశములనుకూడా ఏర్పాటు చేసుకొన్నది.


అయ్వాషయములలో విశేష జ్ఞానసంపన్ను లను తయారు చేయడము జర్మను విద్యాపద్ధ


201