పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/206

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్తారు. మధ్యాహ్న భోజనమునకు రెండుగంటలు మాత్రము విరామముంటుంది. ఇంత కష్టపడినా, ఆటలు, వ్యాయానుములు ఎక్కువగాగల ఇతర జాతుల వారికంటే జర్మనులు ఎక్కువబలము, ఆరోగ్యము కలి'గి ఉంటారు.

యుద్ధమునకు పూర్వము, కైజరు యాజ మాన్యము క్రింద ఆ యా జర్మను రాష్ట్రములు ఒక్కటిగా చేరినవి.వీరిలో ప్రషియా రాష్ట్రము వారి పలుకుడి ఎక్కువగాఉండేది. ఇప్పుడు" కైజరు అవలంబించిన పద్ధతిపోయినది; జర్మను భాష, జర్మను విజ్ఞానము మాత్రమే జర్మనుసామ్యాజ్యమును ఒక్కటిగా నిలబెట్టుతున్నది. ఇప్పటి జన్మను రాజ్యాంగములో ఏదో ఒక రాష్ట్రమున కే ఎక్కు నపలుకుబడి లేదు. ఇరవై ఆరు రాష్ట్రముల లోను ప్రతి రాష్ట్రమున్ను జర్మను సామ్రాజ్యము తనదిగా భావించుకొంటుంది. రాష్ట్రములన్నీ ఒక సామ్రాజ్యమయి ఏకముగా ఉండడము లాభకర మని జర్మనులు గ్రహించినారు. కొద్ది కాలము లో తండ్రి రాజ్యముతో పరదేశములలో ఉండే


199