పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/186

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీటిని మొదట కార్మికులుండే పట్టణాలలో మొదలు పెట్టినారు. ఈ పద్ధతిని కేంబ్రిడ్జిలో 1871 సం! రమున అరంభించినారు. దానిని తక్కిన విశ్వ విద్యాలయాల వారుకూడా అవలంబించినారు. ఇప్పుడీ పద్ధతి ఎక్కువ ప్రచారములో ఉన్నది.

విశ్వవిద్యాలయాలలో అందరినీ చేర్చుకో వడమువల్ల చదువుకొనే వారి సంఖ్య ఎక్కువ కావడ మేకాని, విద్యలో అభివృద్ధి కనబడదనిన్నీ , విశ్వ విద్యాలయాలు పరిశోధనను సాగించి, కొత్తవిష యాలను కనుక్కొని, తాముకని పెట్టిన దానిని జన సామాన్యమునకు తెలియ జేయనలసినదనిన్ని లారు హాల్డేను గారి అభిప్రాయము,

ఇంగ్లాండులోను ఈఉద్యమమారంభ మయి నప్పుడే జర్మనీ లో కూడా ఆరంభమయినది. పద్ధతి ప్రకారము మొదటి బడి 1879 సం:రమున లేచినవి. అప్పటినుంచిస్ని , ఇట్టి బకు లెన్నో లే చినది. పల్లెటూళ్ళలో ఇటువంటివి ఉన్న తపాఠశాలలుగా ఉంటవి. వీటిలో వ్యవసాయమును ఎక్కువగా చెప్పుతారు. 14 సం|రములకున్ను,


179