పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/135

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీనిలో మొదటి శాఖపని విద్యార్ధులకు అప్పులివ్వడము. దీని కోసము సంఘము వారికి ప్ర భుత్వమువారు సంవత్సరమునకు 800,000 పౌను లిస్తారు. దీనిలో రెండు వంతులు మూల ప్రభుత్వ ము. వారున్ను , ఒకవంతు రాష్ట్రీయ ప్రభుత్యము వారున్ను ఇస్తారు. ఈ గ్రాంటును పది సంవత్స గములవరకున్ను ఇవ్వడమునకున్ను, ఆతరువాతే ఆ 80 లక్షల పౌనులను మూలధనముగా చేసుకొని, సంఘము తనపనిని సాగించుకొనడమునకున్న ఏస్పాటు జరిగినది. విద్యార్థులు తీసుకొన్న సొమ్ము ఇచ్చి వేస్తే, దానిని తిరిగి అప్పులిస్తూ ఉంటారు. జర్మనీలో బ్యాంకు లో నూటికి 8 చొప్పున వడ్డీ ఉన్నా, సంఘమువారు 3 చొప్పున నే అప్పులిస్తారు. పద్ధతివల్ల నష్టము రాకుండా ఉండడమునకు, అప్పు కావలసిన విద్యార్థి చెల్లించక పోతే తనకు బదులుగా చెల్లించడానికి ఒక పెద్ద మనుష్యుని : జామీనుగా ఇవ్వవ లెను. విద్యార్థులు కొందరు మృతి నొందుట వల్లను చదువయిన తరువాత విద్యా రులకు పనిదొరకక పోవడమువల్లను, కొన్ని అప్పు

128