పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/123

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయము 12


పట్టణములలో విద్యార్థులకు వసతులు.

విద్యార్థులకు తగిన బసలను ఏర్పాటు చే యడము విషయములో ప్రతి పెద్ద పట్టణములోను కష్టము లుంటవి. ఇంగ్లాండు దేశములో కొన్ని పట్టణములలో విద్యార్థులకు కొన్ని వసతి గృహ ములను ఏర్పాటు చేసినారు గాని, వీటిలో స్థలము బొత్తిగా చాలకుండా ఉన్న ది. జర్మనీలో విద్యా ర్థులకోసము గృహములు కొన్ని కట్టినారుగాని ఇవి మీటింగు , చేకొనే విద్యార్థి సంఘములు గా ఉన్న విగాని, వసతిగృహములుగా తగి ఉండ లేదు. విద్యార్థులకు ఎక్కువ ఖర్చు కాపడము ,వారి వసతులు అనారోగ్యముగా ఉండడము, సరియైన వ్యాయామముగాని, సహవాసముగాని లేకపోవడము- ఇవన్నీ ప్రతి పెద్ద పట్టణములోను ఉండేవే. కలకత్తాలో ఈ సమస్య చాలా క్లిష్టముగా ఉన్నది. ఇప్పటికిన్ని ఈకష్టాలను తొలగించ డానికి తగిన ప్రయత్నాలు జరగలేదు. యూరోపు దేశములో వలె ఇండియాలో కుటుంబీకులు



116