ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రింది చరణాలు 2 చరణం వలె పాడాలి

3) నడుమూకు వడ్డాణం లేక
నడుము చిన్న బోయినది
నల్గురు చెల్లెళ్ల నమ్మి
నడుమూకు వడ్డాణం తేర ||

4) చేతికి చెండీల్ లేక
చెయ్యి చిన్నబోయినది
చేనిలోని పంటానమ్మి
చేతికి చెండీలు తేరా ||

5) పట్టెమంచం పరుపు లేక
మనసు చిన్న బోయినది
పంట భూములమ్మూకోని
పట్టెమంచం పరుపు తేర ||


సేకరణ - హైదరాబాద్