ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతను భీమవరం ఆకివీడు

ఈరవాసరం సంతలోన

గేదెపెయ్య తెచ్చినానె

పాలెయ్యవే పిల్ల - పెరుగెయ్యవే ||


ఆమె ఓరోరి నామగడ

వయ్యారి నామగడ

ఎర్రిబాగుల నామగడ

ఏబ్రాసి నామగడ

కొమ్ములున్న గేదెకూ

పాలుంటయా - పెరుగుంటదా ||


         సేకరణ 1938 (మచిలీపట్నంలో)