ఈ పుట ఆమోదించబడ్డది

39

అతను బావిలో ఉన్న గుంటలోన నువ్వు పడ్తెనూ
              వెట్టోణ్ని పిలిపించే యెత్తిస్తెనూ

ఆమె ఆ ఎత్తిస్తవా
అతను ఊ ఎత్తిస్తనూ

ఆమె నువ్వు - యెట్టోణ్ని పిలిపించే యెత్తిస్తెనూ
              నే - దెయ్యమై, భూతమై నిన్ను పడ్తనూ

అతను ఆ నన్ను పడ్తవా
ఆమె ఊ నిన్నే పడ్తనూ

అతను నువ్వు - దయ్యమై భూతమై నన్నుపడ్తెనూ
              నే - భూతవైద్యుణ్ని పిలిపించి వదలగొడ్తనూ

ఆమె ఆ - వదలగొట్తవా
అతడు ఊ - వదలగొట్తనూ

ఆమె నువ్వు - వైద్యుణ్ని పిలిపించి వదల గొట్తెనూ
             నే - తిరుపతి కొండెక్కి తిరిగి చూడనా

అతను నువ్వు - తిరుపతి కొండెక్కి తిరిగి చూసితే
             నే - బెంగపురి కొండెక్కి చిందొక్కనా ||

అడవి బాపిరాజు గారి వద్ద సేకరించినది (1938)