ఈ పుట ఆమోదించబడ్డది

28

గుంటూరు చిన్నదాన

హరికాంభోజి స్వరాలు - ఆదితాళం


గుంటూరు చిన్నదాన
గుబురూ కేశాలదాన
గుబురూ కేశాలమీద
గొబ్బిపూలు సోకే
          ఓ చిన్నదానా
          ఓ చిన్నదానా ||

పువ్వాడ చిన్నదాన
పువ్వూల జడలదాన
పువ్వూల జడలమీద
మనసెంత నాకే
          ఓ చిన్నదానా
          ఓ చిన్నదానా ||

రంగాము పోయి నేను
రంగైన రైకతెస్తె
రంగైన రైకమీద
మనసేల లేదే
          ఓ చిన్నదానా
          ఓ చిన్నదానా ||

(" గుంటూరు చిన్నదాన గుళ్ళా పేరూలదాన " వరుసలాగ)