ఈ పుట ఆమోదించబడ్డది
అతను : గొజ్జంగీ పూగుత్తీ
కూలేనే నేలొత్తీ
రాలీన రేకులపై
వాలేదే ఈగైనా
ఎంకులు గాణ్ణి జంపెయనే
డెంకాలోళ్ల యెంకమ్మా
ఎంకులుగాణ్ణి తరిమెయవే
డెంకాలోళ్ల యెంకమ్మా ||
ఆమె : సుక్కల్లా లేడెనెకా
మచ్చల్లా సిందుగురా
పరుగెత్తీ పరుగెత్తీ
ఒరిగిందీ చిరులేదే
ఎంకులా గాణ్ణి ఆపెయరో
లంబాలోళ్ల రమదాసా ||
అతడు : సిందుగుమా జంపేనే
సిరుతొకటీ యెంటడితే
సిరుతానూ యేటాడే
కరిసార్లా పులి ఉరికే
ఎంకులు గాణ్ణి జంపెయనూ
డెంకాలోళ్ల యెంకమ్మా
ఎంకులు గాణ్ణి తరిమెయనూ
డెంకాలోళ్ల యెంకమ్మా ||
(అన్ని చరణాలూ మొదటి చరణం వలె పాడుకోవాలి)
సేకరణ - అడవి బాపిరాజు వద్ద
బందరు (1936)