ఈ పుట ఆమోదించబడ్డది

ఓయి బావల్లాల వలె


శంకరాభరణం స్వరాలు త్రిశ్రం


ఆగరగ పట్టింది ఎన్నెలా
నీళ్లా కొచ్చింది ఎన్నెలా
పాపేడి సెట్టెక్కి ఎన్నెలా
పలకిర్రయిన యిరిసో ఎన్నెలా
పగడాల రాయెక్కి ఎన్నెలా
పలువరుసైన తోమో ఎన్నెలా
ముత్యాల రాయెక్కి ఎన్నెలా
మునివళ్లైన తోమో ఎన్నెలా
నులుపైన రాయెక్కి ఎన్నెలా
నాలుకైన గీసో ఎన్నెలా
ముడికీడు నీళ్లలో ఎన్నెలా
మొకమైన కడిగొ ఎన్నెలా
చేరాడు నీట్లోను ఎన్నెలా
చెయి జెబ్బలు కడిగో ఎన్నెలా
సుట్టు జల్తరుసాపు ఎన్నెలా
సుమ్మ జుట్టిందో ఎన్నెలా
ఆగరగ ముంచింది ఎన్నెలా
ఒడ్డున పెట్టింది ఎన్నెలా
అటు ఇటు చూచింది ఎన్నెల
ఎవ్వారులేరో ఎన్నెలా
గట్టుమీద కామూడ ఎన్నెలా
గరగత్తి పోరా ఎన్నెలా