ఈ పుట ఆమోదించబడ్డది

ఒయిబావల్లాల వలె


శంకరాభరణం స్వరాలు - త్రిశ్రం

1)

ఏవూరు ఏపల్లె తుమ్మెదా
ఎక్కడికి ఎల్తావు తుమ్మెదా


గులకల్ల పాడూగుమ్మడే
గోదారీ పక్కని గుమ్మడే


గులకల్లపాడూ తుమ్మెదా
అత్తోరు ఊరా తుమ్మెదా


పుట్టిల్లుమాదీ గుమ్మడే
గులకల్లాపాడే గుమ్మడే


పాడిపంటలు ఉందా తుమ్మెదా
సంతానము ఎందరె తుమ్మెదా


పాడిపంట లేదు గుమ్మడే
సంతానము లేదు గుమ్మడే


అత్తగారు ఉందా తుమ్మెదా
ఆడబిడ్డలు ఉన్నారా తుమ్మెదా


అత్తగారు పోరు గుమ్మడే
ఆడబిడ్డలపోరు గుమ్మడే
పడలేక నేనూ గుమ్మడే
మాఊరు పోతున్నా గుమ్మడే