ఈ పుట ఆమోదించబడ్డది

9)

వత్తాన కాపన్న తుమ్మెదా
గట్టొంక సూసేడు తుమ్మెదా

10)

సందొక సూసేడు తుమ్మెదా
నడ్డీన చెయ్యేసి తుమ్మెదా

11)

ఎక్కడిది యీ నంది తుమ్మెదా
ఏడది యీ నంది తుమ్మెదా

12)

పండినా వరిసెలు తుమ్మెదా
పాటులడా తొక్కింది తుమ్మెదా

13)

ఈనినా వరిసెలు తుమ్మెదా
యీదిలాడ దొక్కింది తుమ్మెదా

14)

అంటానె ఎల్లాడు తుమ్మెదా
గొంతమ్మా మేడకు తుమ్మెదా

15)

మేడల్లా గొంతెమ్మ తుమ్మెదా
ఏలాగు నుందీ తుమ్మెదా

16)

ఉయాల్లో గొంతమ్మ తుమ్మెదా
ఊగుతూ వున్నాది తుమ్మెదా

17)

వచ్చే కాపన్నను తుమ్మెదా
కళ్ళజూసీ నాదీ తుమ్మెదా

18)

ఎన్నడూ రానీ కాపన్నకు
ఏమి పనూలాయె తుమ్మెదా