ఈ పుట ఆమోదించబడ్డది

నాటేరమ్మ నాటేరు

మధ్యమావతి స్వరాలు - ఆదితాళం

1)

ని స రి ప ప మ మ రి | రి స సా | సా . . ||
నా - టే - ర - మ్మా - | నా - టే | రూ . . ||
ఏ మీ మొ క్కా - | నా - టే | రూ - ||


రీ మ ప పా పా | ప ని ని స | పా ప మ ||
జా జా - ర మ్మా | తో - టా - | లో నా - ||


రీ రి మ పా ప మ | రీ రి స | సా . . ||
జా జీ - మొ క్కా - | నా టే - | రూ . . ||


2)

సాగేనమ్మా సాగేను
ఎమి తీగ సాగేను
జాజారమ్మా తోటాలోనా
సన్నాజాజీ సాగేను ||

3)

ఏసేనమ్మా యేసేనూ
ఏమి సిగురూ యేసేనూ
జాజారమ్మా తోటాలోనా
సేమంతులూ సిగిరేసె ||

4)

తొడిగేనమ్మా తొడిగేను
ఏమి మొగ్గలు తొడిగేను
జాజారమ్మా తోటాలోన
రోజా మొగ్గలు తొడిగేను ||