ఈ పుట ఆమోదించబడ్డది
ఓమ్‌ :

ఊడ్పుల ప్రారంభం

వినాయక ప్రార్థన

1. రి రి గ - గ గ రి - స స స రీ స | నీ, - ,, - ,, ||

గ న ప - త య్య గ న ప త - | య్యా - ,, - ,, ||

రి రి గ - గా రి - సా స - రీ స | సా, - ,, - ,, - రీ మ ||

ఉం డ్రా - ళ్లు - నీ కు - పో తు | రా, - ,, - ,, - ఓ - ||

మ మ మ - గా రి - రీ మ - మ మ గ |

గ న ప - త య్య - మం ద కొ డి గ |

రీ మ - గా రి - సా, - ,, ||

ఉం డ - బో కు - రా, - ,, |


2. గనపతయ్య గనపతయ్య

జమ్మిపత్రి పూజసేతురా

ఓ-గనపతయ్య ముందెనీకు పూజసేతురా ||


3. గనపతయ్య గనపతయ్యా

మనసునిండ పూజసేతురా

ఓ-గనపతయ్య మమ్ము ఎపుడు మరువబోకురా ||


4. గనపతయ్య గనపతయ్యా

ఊరిలోన ఊరేగించెదా

ఓ-గనపతయ్య ఉయ్యాలల ఉఫుతానురా ||


5. గనపతయ్య గనపతయ్యా

ఉండ్రాళ్ళు నీకు పోతురా

ఓ-గనపతయ్య మమ్ము ఎపుడు మరువబోకురా ||