ఈ పుట ఆమోదించబడ్డది

దిగు దిగు నాగన్న వలె

ఖరహరప్రియ స్వరాలు - మిశ్రచాపు

1)
దిగు దిగు నాగన్న దివ్యసుందర నాగ
ముందు ముందుగ దిగు ముద్దుల నాగన్నా
నాగాదిగరా
తండ్రీ దిగరా
శేషూ దిగరా

2)
ఇల్లలికీ ముగ్గెట్టీ, మొల్లాలంతట సలీ
కొల్లరాయక పోరా, పోరానాగన్నా
నాగదిగరా, తండ్రీదిగరా, శేషూ దిగరా

3)
అక్షయమ్ముగ పాలు, అరటి దొన్నెలొపోసి
నీరూ కలవనీ పాలు, నీకిత్తుగదరా
నాగాదిగరా, తండ్రీదిగరా, శేషూదిగరా

4)
పిల్లలందరు గూడి పుల్లాలేరుసు నుండ
పుల్లల్లో మెదిలేటి పిల్లానాగన్నా
నాగాదిగరా, తండ్రీదిగరా, శేషూదిగరా

5)
దిగితేవె దిగినట్లు, దిగపోతే దిగనట్లు
ఏడూసిరసులపైనా, ఎగిరి తన్నుదునీవు
నాగాదిగరా, తండ్రీదిగరా, శేషూదిగరా

6)
ఎక్కు రెండేమెట్లు, దిగరా మూడూ మెట్లు
మూడు మెట్లాసందు, ముద్దిచ్చిపోరా
నాగాదిగరా, తండ్రీదిగరా, శేషూదిగరా