ఈ పుట ఆమోదించబడ్డది
దిగు దిగు నాగన్న వలె
ఖరహరప్రియస్వరాలు-మిశ్రచాపు
1)
దిగు దిగు దిగునాగ దివ్యసుందరనాగ
ముదముతో రేపల్లె ముద్దులనాగా
నాగా దిగరా
నాగాదిగరా నామనవిచేకొనరా
2)
అచ్చనావులపాలు అరటిదొన్నెలోపోసి
నీళ్లూకలవని పాలు నీకోనవిడుతూ
నాగాదిగరా
3)
ఎర్రగ ప్రొద్దూ పొడిచీ ఏడూగడియాలాయె
బాలాకు విషమెక్కి బహుబాధాలాయె
నాగాదిగరా
4)
ఆకొండా ఈకొండా నడుమా నాగూలకొండా
కొండాపై నుండేటి కోడినాగన్నా
నాగాదిగరా
5)
ఏడాది కొకసారి నాగూలచవితొచ్చె
నూటొక్కాపిండిముద్దా నీకోనలిడుదూ
నాగాదిగరా ||
సేకరణ - పిఠాపురం