ఈ పుట ఆమోదించబడ్డది
ఒడినిండ పస్పేస్కో
28 వ మేళకర్త హరికాంభోజి స్వరాలు - ఆదితాళం
1)
- ధ సా స ధ సా స | ధ సా రి గా మ గ ||
- ఒడి నిండ స స్పే సొ | వ య్యా ర మే మె - ||
- రి రి గ రి స స సా | రి రి గ రి స స సా ||
- గు నా సా రి గు న్న మ్మా | గు నా సా రి గు న్న మ్మా ||
2)
- పొద్దున్న నువ్వులెగసి పొలానికెళ్లే
- గునాసారి గున్నమ్మా
3)
- ఎండెక్కి సూరీడు కొండెక్కి సూసే
- గునాసారి |గున్నమ్మా|
4)
- గంపాకిందా కోడి కయ్యిమని లేచె
- గునాసారి |గున్నమ్మా|
5)
- గొప్పు తవ్వేకాడ కొప్పెందుకోలె
- గునాసారి |గున్నమ్మా|
6)
- గట్టెక్కి సూత్తాడొ గవరయ్య కాపు
- గునాసారి |గున్నమ్మా|
7)
- మద్దేనం యాలపుడు మరిదప్పి కెత్తె
- గునాసారి |గున్నమ్మా|
8)
- సల్దిగెంజి కాత తాగీమరి ఉ డూ
- గునాసారి |గున్నమ్మా|