ఈ పుట ఆమోదించబడ్డది

66

జడకుచ్చులు




A. ప్రొద్దుపొడుపులఁ గమ్మని పూలజతల,
    సందెవేళలఁ జల్లని చందనములు
    నిశల మధుర వీణలాలనీయరుచుల
    నదిమొదల్ ప్రియుఁ గాంక్షించి వెదకుచుంటి.

గీ. పైరదిరిగి కళ్యాణపు పాటఁబాడు
   పచ్చివంశిని బతిమాలి భంగపడితి ,
   “ముందుముం”దని వినఁబడ్డ మోహనోక్తి
   సూత్రములులాగినట్టు లంచులను నడచి.

గీ . సంకెలలు త్రెంచి పోదుఁ బూసంకెలలను
   బ్రియుని బంధింపవలెనంచు పిన్నవాడ!
   నాకు సహకరివగుచు నీనావ నిచ్చి
   కృష్ణ దాటింపు, మవల సుఖంపనగును.

గీ. నావ నడియేట వర్తించె నటివిధాన,
   నిష్క్రమించిరి పాత్రల నియతివారు,
   అలలచేతఁ బాడించెఁ బాటలను బ్రకృతి
   యపుడు నిమ్మకు నీరెత్తి నట్టులుండి.