ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎవరు ?

63

నీ మీద మోహము నోభామా!
నిలిపి యోపంగలేక ఓభామా!
వెన్నెలలేతెంచు ఓ భామా!
సన్న త్రోవలు బట్టి యోభామా!

తీయనిగీతము లో భామా!
తీసిన తెన్నుల నోభామా!
సొగసు ప్రేముపుదీప మోభమా!
చూపినజాడల నోభామా!

భావోత్తరీయము నోభామా!
పఱచి చేసిన దారి నోభామా!
ఎవరుముగనకుండ నోభామా!
యేకాకినై లేచి యోభామా!

కాళ్ళు నొప్పులుపుట్ట నోభామా!
కడువడివచ్చితి నోభామా!
నీ మేలిపడకిల్లు ఓ భామా!
ప్రేమతో వెదకితి నోభామా!

వేసినవాకిండ్లు ఓభామా!
వీడఁగఁ దట్టితి నోభామా!
ముఖశయగంబుస నోభామా!
సోలీన సుప్తి ని నోభామా!