ఈ పుట ఆమోదించబడ్డది

28

జడకుచ్చులు



5


పత్రాలు రాల్చితి ♦ పచ్చని చెట్ల
జీవనక్షామమ్ము ♦ జేర్చితి నదుల,
పనిపాట లావల ♦ బంపితి విండ్ల,
చాలదే నీ పాలి ♦ జయమింకఁ జైత్ర!

6


మధుపాతమున భూమి ♦ మరపించినావు
సుఖరక్తిఁ బ్రజలను ♦ పాలించినావు
పగలు దీర్ఘములుగాఁ ♦ బాటించినావు
చాలవే యీనాళ్ళు ♦ చక్కని చైత్ర !

7


కష్టమో సౌఖ్యమో ♦ గడపితి విచట
నీ మంచి కాలంబు ♦ నీటుగో టెగయ
దుఃఖంప కవసాన ♦ దురవస్థ కిపుడు
కాలచక్రము నాప ♦ గా లేము చైత్ర!

8


నవనవ లాడేటి ♦ చివురాకులెల్ల
కఱకెక్కె నెండ కా ♦ కలుబోలె ముదిరి,
నవ్యవాతములు దు ♦ స్సహములై రేగె
నిప్పులు గ్రక్కుచు, ♦ నెయ్యంపు చైత్ర!