ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబోధము

అమరావతీపట్టణమున బౌద్ధులు విశ్వ
          విద్యాలయములు స్థాపించునాఁడు
ఓరుగల్లున రాజ వీరలాంఛనముగాఁ
          బలుశస్త్రశాలలు నిలుపునాఁడు
విద్యానగర రాజ వీధులఁ గవితకు
         పెండ్లిపందిళ్ళు క ప్పించునాఁడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య
        దిగ్జయ స్తంభ మెత్తించున్నాడు

గీ. ఆంధ్ర సంతతికే మహితాభిమాన
   దివ్య దీక్షా సుఖస్ఫూర్తి తీవరించె
   నామహావేశ మర్థించి యాంధ్రులార!
   చల్లుఁ డాంధ్రలోకమున నక్షతలు నేఁడు!

సీ. తనగీతి యఱవజాతిని పాటకులనుగా
                   దిద్ది వర్ధిల్లిన తెనుఁగువాణి
    తనపోటులు విరోధి తండంబులకు సహిం
                   పనివిగా మెరసిన ఆ తెనుఁగుకత్తి
    తనయందములు ప్రాంత జనుల కభిరుచి వా
                  సన నేర్ప నలరిన తెనుఁగు రేఖ
    తనవేణిక లు వసుంధరను సస్యశ్యామ
                 లనుజేయఁ జెలఁగిన తెనుఁగుభూమి