ఈ పుట ఆమోదించబడ్డది

40

జడకుచ్చులు

ఉప్పు కల్లుకుఁ గూడ ♦ నొడ లమ్మవలసిన
                    ఆధార శూన్యులౌ ♦ అనదవాండ్ర
ఇంటిబానినబాకి ♦ రే సర్వమని తూర్పు
                    పడమర లెఱుగని ♦ పల్లెసతుల

గీ.ఎవ్వడింక తాంబూర వా ♦ యించుకొనుచు
   దరిసి నడుపు పజాహ్లాద ♦ తంత్ర మెపుడు?
   అన్నకాటక మటులుండ ♦ నావహించె
   భూమి నానంద దుర్భిక్ష ♦ మును సఖుండ!
                          3

సీ.వినువారి కన్నీరు ♦ వినవాకగా బొంగ
                  సీతమ్మ కష్టాలు ♦ సెప్పిసెప్పి
   వెఱ్ఱిగొల్లడు గూడ ♦ నుఱ్ఱూతలూగంగ
                  వీధిభాగవతాలు ♦ వేసివేసి
   ముసలివాండ్రును మీస ♦ ములు త్రిప్పి కాకెక్క
                  వీరబొబ్చిలికథల్‌ ♦ వినిచి వినిచి
   ఆబాలగోపాల ♦ మావేశమున త్రుళ్ళ
                  పల్నాటియుద్ధాలు ♦ పాడిపాడి

గీ.పల్లెపల్లెల బ్రాణము ♦ పచ్చగిల్ల
   జూతిసుఖము పోషించితి ♦ సర్వకాల
   మెచ్చట సురింగిపోతివో ♦ బిచ్చకాఁడ
   కవివి పాటకుఁడవు నీవె ♦ గావె సఖుఁడ!