ఈ పుట ఆమోదించబడ్డది
జత
44
ఎంత రాజసం
ఆనడకలో..
పసుల మందకు
తానే రాజు మరి!
నిజాం
గడీ కూల్చేశాం అనుకున్నాం...
కొందరి రూపంలో
ఇంకా బ్రతికే ఉన్నాడు!
పశునియంత్రణకు
ముక్కుతాడు!
మాభవిష్యత్తు నాశనానికి
పెళ్లితాడు!
మాకన్నీళ్లతో
సముద్రాలు నిండాయి!
మాకోపానికి
ఆవిరైపోతాయి!