ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రశంసాభఖినందనలు

రాములమ్మ పదాలు, నానీల' జత పొత్తము మా (అపూర్వ విద్యార్థి చి॥ నర్సింహా రెడ్డి ఆత్మాశ్రయ కవితా సంకలనం. డైట్‌, నేరెడ్‌ మెట్‌ కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణార్ధిగా ఉన్న రోజుల్లో అనేక సందర్భాలు, సమావేశాలలో ఆశువుగా రాసి పఠించిన కవితలు అధ్యాపకుల, సహ ఛాత్రోపాధ్యాయుల మన్ననలు పొంది ఉన్నాయి.

కొంత కాలంగా వివిధ సంఘటనలు, అనుభవాలు, స్పందనలు, ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశాలతో కూడిన సహజ సిద్ధమైన తన యవ్వన దశ లక్షణాల ప్రతిబింబాలే ఈయన కవితలు.

సైకాలజీ ప్రకారం వ్యక్తులు, అంతర్వర్తనులు (6౯0౪౮౦) మరియు బహిర్వర్తనులు (శాల) అని రెండు రకాల మూర్తిమత్వాన్ని కల్గి ఉంటారని మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈయన మొదటి కోవకు చెందిన వాడుగా తోస్తుంది. నిశ్శబ్ద సముద్రం లాంటి ఇతన్ని ఎప్పుడు, ఏ తుఫాను ఎలాంటి ప్రభావానికి గురిచేస్తుందోనని అందరూ భావించేవారు.

మహాకవి ఆరుద్ర గారి 'కూనలమ్మ పదాల" ప్రేరణతో ఆ ఛాయలో రాములమ్మ పదాలు" రచించాడు. నానీల ఆయువుపట్టెరిగి తనదైన ముద్రతో 'నానీల'ను వెలువరించాడు.

వస్తువైవిధ్య భరితాలు సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాసంబంధిత అంశాలపై తన అస్త్రాలను సూటిగాను, నర్మ గర్భంగాను ఎక్కుపెట్టాడు.

శబ్దాలంకారాల్లో అనుప్రాస, యమకం అర్ధాలంకారాల్లో ఉపమా, అతిశయోక్తి దృష్టాంత, రూపక్క స్వభావోక్యలంకారాల సముచిత ప్రయోగాన్ని పీరి రచనలల్లో గమనించవచ్చు. ఆయన చెప్పినట్లు హాస్యరస ప్రీతి, వ్యంగ్య ధోరణి మెండు. మాత్రాఛందస్సులో నడిచే రాములమ్మ పదాలు' లో ప్రతి చరణంలో పదేసి మాత్రల వినియోగం జరిగింది. దరహాసం, ధర హాసం అని ప్రయోగించిన తీరులో వీరి శబ్దాధికారం, శబ్దాలంకార ప్రీతి ద్యోతకమవుతుంది. శబ్ద వృత్తులను బట్టి, వాచ్యంగా చెప్పిన సందర్భాలతో పాటు వ్యంగ్యంగా/ధ్వనిపూర్వకంగా రచించిన కవితలనూ చూస్తాము. అలాగే నవరసాల్లో ప్రధానంగా హాస్యము, కరుణము శృంగార రసములు సహృదయ పాఠక హృదయాల పై ఆవిష్కరింపబడగలవు. శబ్ద ప్రీతి శబ్దాధికారము,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/4&oldid=376211" నుండి వెలికితీశారు