ఈ పుట ఆమోదించబడ్డది

27

నర్సింహారెడ్డి




గుంతల
రోడ్డు మీదే ప్రసవమైంది!
మునుపటి ఎమ్మెల్లే
మళ్ళీ గెలిచాడు!


చైనాది
సామ్రాజ్యవాదం...
పోటీదారులతో తగువు
దాని నైజం!


రోడ్డు మీద
ఎవరూ లేరేమిటి?
చలి పొదిగిట్లో
నగరం నిద్రపోతుంది!


సమయానికి
సమయం ఇవ్వాలి!
సాధించాలంటే
సహనం కావాలి!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/37&oldid=404297" నుండి వెలికితీశారు