ఈ పుట అచ్చుదిద్దబడ్డది
25
నర్సింహారెడ్డి
కంద పద్యము నున్న
కఠిన ఛందము కన్న
రాములమ్మే మిన్న
ఓ రాములమ్మ!
కథలొ అసురుల కన్న
నార్తు కొరియ నున్న
కిమ్ క్రూరుడని విన్న
ఓ రాములమ్మ!
నిదురోయెను దేవుడు
పిలిచి చూడు పలుకడు
నునిసి.మనిషుతోడు
ఓ రాములమ్మ!
దేశ రక్షణ వెనుక
ఉన్నదెందరొ గనుక
నిలబడెను పడిపోక
ఓ రాములమ్మ!