ఈ పుట ఆమోదించబడ్డది

15

నర్సింహారెడ్డి




చిన్ని పదముల తోటి
వేల ఎదలను మీటు
రామలమ్మయె మేటి
ఓ రాములమ్మ!


తనది కాని విషయము
వేలు పెట్టును నిజము
ఇది యూఎస్‌ నైజము
ఓ రాములమ్మ!


నాకు శత్రువు నీకు
మిత్రుడని అనబోకు
అది యాంటి కాట్సాకు
ఓ రాములమ్మ!


ఎన్నికల హామీలు
అనెడు తీయని పాలు
తుదకవు నేల పాలు
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/25&oldid=406189" నుండి వెలికితీశారు