ఈ పుట ఆమోదించబడ్డది

9

నర్సింహారెడ్డి


డెమోక్రసి సామ్రాట్లు
ప్రజ పేల్చు బుల్లెట్లు
పంచవర్షపు ఓట్లు
ఓ రాములమ్మ!


కాలు తెగిన గానీ
కదలక ఆగిపోని
వాడికే విజయమణి
ఓ రాములమ్మ!


మతము లన్నవి గతము
మానవతకు వ్రణము
సమత, మమతలె ఘనము
ఓ రాములమ్మ!


ఇసుక దిబ్బలెడారి
తగిలి పాద మొకపరి
పూయునే సుకుమారి
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/19&oldid=404401" నుండి వెలికితీశారు