ఈ పుట ఆమోదించబడ్డది

జత

4




ఆకలయ్యిన తాను
జింకచాలని అనును
మితకాంక్షి సల్మాను
ఓ రాములమ్మ!


కలము చచ్చెను నేడు
ప్రభుత మెచ్చెను చూడు
దేశమున కిది కీడు
ఓ రాములమ్మ!


ప్రజలు మెచ్చని నేత
పదవి కెక్కెను వింత
ప్రజాస్వామ్యము చెంత
ఓరాములమ్మ!

 
ప్రగతి గోరెడి నేల
అసత్య నమ్మకాల
నీట మునుగుట ఏల?
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/14&oldid=404386" నుండి వెలికితీశారు