ఈ పుట ఆమోదించబడ్డది

3

నర్సింహారెడ్డి




విలువైన రత్నమ్ము
గురువర్యు పాదమ్ము
నకగునా తుల్యమ్ము
ఓ రాములమ్మ!


చేదైన ఈ నేడు
తీపి గవ్వును చూడు
నిరుత్సాహము వీడు
ఓ రాములమ్మ


పెరిగి పెట్రోల్‌ రేట్లు
పొడిచె పర్సుకు తూట్లు
మధ్యతరగతి పాట్లు
ఓ రాములమ్మ!

 
అతిగ పొగిడిన తప్పు
పొగడ కుండిన ముప్పు
సెలవి డేమిటొ ఒప్పు?
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/13&oldid=404385" నుండి వెలికితీశారు