పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/51

ఈ పుట ఆమోదించబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

37



8. దేవీ ! విశాలమైన ఆకాశమందు నీవు ప్రీతిచే జ్వలించుచు 'ప్రచండ' పదము ముందుగల చండివై ప్రకాశించుచుంటివి.

(ఆకాశమందు మహిమచే జ్వలించుశక్తి ప్రచండచండి కనుకనే యీమె వైద్యుత శక్తిస్వరూపిణి.)


9. ఓ యంబా ! స్వరరూపిణివై నను యఖిలమునకు బుద్ధి నిచ్చుచు 'గౌరి' వైతివి. త్రికాలములే శరీరముగా గలిగి యిచ్చట 'కాళి'గా స్మరింపబడుచుంటివి.

(అనగా బుద్ధినిచ్చు చిచ్చాఖ యొకటి, నాదముచే పరిణామములను గల్పించు క్రియా శాఖ యింకొకటి.)


10. ఓ యీశ్వరీ ! మహస్సు, స్వరము అను రెండును అతి సూక్ష్మములు. అవి యుత్కృష్టమగు నీయొక్క అంశద్వయముగా చెప్పబడుచున్నవి.


11. స్వర్గమును బొందిన నీ మహస్సు అతిశయమును బొంది యున్నది (ఆకాశముకంటె నివృత్తిచే వేఱైన స్వర్గమందు మహస్సై ఆకాశముతో గూడిన భువనమందది సహస్సనబడును) అట్లే కైలాసమందు వసించు నీ స్వర మతిశయించుచున్నది. (స్వర్గములో మహస్సు విభూతి, కైలాసమందు ప్రణవము విభూతి)


12. మొదట చెప్పబడిన దేవి (అనగా అతిశయించిన మహస్సు కలది) దివమును బొందించుచున్నది, తరువాత చెప్పబడిన దేవి భువమును బొందించుచున్నది. (మొదటిది నివృత్తి స్వరూపిణి, రెండవది ప్రవృత్తి స్వరూపిణి.) ఈ రెండింటికి మూలము కొలవ శక్యముగాని విశాలాకాశమే. (సచ్చిదానందమే)