ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంగ్లీషుపత్రికనించి వొకవ్యాసం అతడు తర్జుమాచేశాడు. "ఇనపతెర వెనక కొత్తవిజ్ఞానం అభివృద్ధి" అని దాని శీర్షిక. ఎవివో వాళ్ళు అతణ్ణి ఎత్తుకుపోయారు. మూడువారాలు నిర్భందంలో వుంచారు. ఏంచేశారో తెలియదు. అతడు ఎన్నడూ ఆవిషయమై పెదవి కదిలించలేదు.

"ఇనపతెర అన్నది అక్కడాలేదు. ఈసంగతి అందరికీ తెలుసు, క్యాపిటలిస్టులు వేసిన అపవాదు ఇది. ఈ అపవాదు ఇతడు తెలివితక్కువగా వాడాడూఅంటే, ఇతడి మెదడులో కాలుష్యం వుందన్నమాట. దానిని బాగుచెయ్యడానికి మూడు వారాలపాటు ఇతణ్ణి ఏవివో వశంచెయ్యాలి" అన్నారు వాళ్ళు, మెదడు కాలుష్యం బాగుచెయ్యడానికి వాళ్ళు ఏంజేస్తారో ఆవ్యాసం తర్ఝుమాచేసిన యువకునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. సూచన ప్రాయముగా అయినా ఇంతకిముందు అతడికది ఎవ్వరూ చెప్పలేదు. చెప్పారో వాళ్ళు పూర్తిగా మాయమే అయిపోతారు.

ఏవివో వాళ్ళభయం కొద్దీ జోసపుటాత్ తాను ఏంమాట్లాడినా, ఏంచేసినా, ఏం నమ్మినా చాలా జాగ్రత్తగా వుండేవాడు. ఏవివో వాళ్ళులేనిచోటే అతదికి అవుపించలేదు. అంచేత ఎక్కడ కాలుజారి వాళ్ళవలలో పడతానో అని బెంగతోనే వుండెవా డతడు. ఇంజను ఫ్యాక్టరీలో తయారయే ఇంజనులు తిన్నగా రష్యా వెళతాయనిఈ, లేదా ఈజిప్టు వ్యాపార సందర్భంలో వెళతాయనీ అతడికి తెలుసు. కాని ఆమాట అతడు ఎన్నడూ ఎవరితోనూ చెప్పడు ఇంజనులమీద అడ్రసులు రాసేవాడితోను అనడు. ఏమంటే వాడే ఏవివో మనిషి కావచ్చు.

బుడాపేష్టులో అప్పుడే చలి ప్రారంభ మవుతూవుంది. సాయంకాలం షిప్టులో తనపని ముగిసాక జోసపు తన కోటు దగ్గిరికి వెళ్ళాడు. దానిని తీసి తొడుక్కున్నాడు. ఫ్యాక్టరీనించి బైటపడ్డాడు. ట్రాం కారు అందుకుని ఇంటికివెళ్ళడానికి బైలుదేరాడు. "కమ్యూనిష్టు పఠన కేంద్రానికి రేపు వళతాను" అనుకుంటూ, తన అయిష్టం తనమనస్సులోనే దాచుకున్నాడు. బహుశా ఫోర్మేను ఏవివో గుంపువాడేమో!

రాత్రిగాలి చురుగ్గా వుంది. జోసపు పదడుగులు ముందుకి సాగాడో లేదో, "నువ్వు హంగేరీ యవకుడివే అయితే మాతోచేరు" అంటూ కేకలు వేస్తూ వొకయుకులగుంఫు తనకి ఎదురయింది. యువ్కులందరూ పాతికేళ్ళలోపు వయస్సు కలవాళ్ళే, వాళ్ళు ఏం చేస్తున్నారో జోసపుకి తెలియదు.