పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్మల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్

గోవన్ గ్రామాలు, పట్టణాల వ్యాసాల సృష్టి అభివృద్ధి


ప్రదేశం: పనజి, గోవా
సంస్థ తరహా: విద్యాసంస్థ

ఉత్తర గోవాలోని మాపుసా పట్టణంలో ప్రసిద్ధ శుక్రవారం సంత, ఆరన్ సౌజన్యంతో

వివరణ:

నిర్మల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సీఐఎస్ ఎ2కె సంస్థల భాగస్వామ్యం ద్వారా కొంకణి భాషలో అంతర్జాల సమాచారం వృద్ధి చేసేందుకు, గోవన్ గ్రామాలు, పట్టణాల గురించి వికీపీడియాలో వ్యాసాలు పెంపొందించేందుకు సర్టిఫైడ్ వికీపీడియా శిక్షణ నిర్వహించారు.

కళాశాలలోని 100 మంది ఛాత్రోపాధ్యాయుల(బి.ఈడీ విద్యార్థులు)ను వికీపీడియాలో నమోదుచేసుకోవడం, వారిని ఒక జట్టుకు ఇద్దరుగా 50 జట్లుగా ఏర్పరచడం. కొంకణి వికీపీడియాలో ఒక్కో జట్టు ఒక్కో గోవన్ గ్రామ (లేదా పట్టణ) వ్యాసాన్ని తీసుకుని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాలు సాధించేలా వికీపీడియా గురించి అవగాహన సదస్సులు, వర్క్ షాప్ వంటివి నిర్వహించాము. విద్యార్థులు వ్యాసాలు అభివృద్ధి చేయడానికి సాంకేతిక సహకారం అందించాము.

సాంకేతిక సహకారం అందించడం, సలహాలు-సూచనలు చేయడం వంటివి విద్యార్థుల అవసరానికి అనుగుణంగా అందించాము. విద్యార్థులు జట్టుగా పనిచేసి కొంకణి వికీపీడియాలో వారు ఎంచుకున్న వ్యాసాలు అభివృద్ధి చేశారు.

భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పంద పత్రాలు సంతకాలు చేస్తున్న కళాశాల మరియు సీఐఎస్ ఎ2కె ప్రతినిధులు, ఛాయాచిత్రం విస్దవివ సౌజన్యంతో

ఫలితాలు, ప్రయోజనాలు:

  • విద్యారంగానికి సంబంధించిన వివిధాంశాలపై అవగాహన ఉన్న వందమంది భావి ఉపాధ్యాయులు వికీమీడియన్లు అయ్యారు.
  • జట్లుగా పనిచేయడం ద్వారా వికీ పద్ధతిలో అభివృద్ధి చేయడం గ్రహించి కొంకణి వికీపీడియా అభివృద్ధికి ఉపకరించే వికీమీడియన్లుగా శిక్షణ పొందారు.
  • గోవన్ గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన అనేక వ్యాసాలు కొంకణి వికీపీడియాలో అభివృద్ధి చెందాయి. సంస్థకు చెందిన ఆచార్యులు, ఉపాధ్యాయులు వికీపీడియన్లు అయిన విద్యార్థులకు, తద్వారా వికీపీడియా సముదాయానికి ఉపకరిస్తుంది.
  • చేతన స్థితికి వచ్చే దశలో కొంకణి వికీపీడియా అభివృద్ధికి ఈ కృషి ఉపకరించింది.