పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

69

జూపి “కుమారా! ఈతఁడొక విచిత్రవృత్తాంతమును జెప్పుచున్నాడు. నీవును దానిని విని కార్యాంశము నాలోచింపుము” అని మహారాజు మదనసింగుతో జెప్పి యెదుట నున్న యాపురుషునివంకఁ జూడ నతఁడు ‘మహారాజా! నేను మహారాష్ట్ర దేశస్థుఁడను; బ్రాహ్మణుఁడను. నా పేరు వసంతభట్టు. నేనీవఱకును ఢిల్లీచక్రవర్తియగు నల్లాయుద్దీను కొలువులో నుంటిని. కాని యతని దౌర్జన్యమును దురాచారమునుజూచి సహింపలేక యాతని కొలువు విడిచి వచ్చినాను. గోవులను జంపు పచ్చితురకల దగ్గర నింతకాలము గొలువు సలిపిన పాపము నాకాశీవిశ్వేశ్వరుడు క్షమించుగాక! స్వదేశీయులును వేదశాస్త్రసంరక్షకులునగు మీకొలువు నిఁకఁ జేయవలయునని మీపాదములచెంతఁ జేరినాఁడను. అని విన్నవించిన యాకథ విని మదనసింగు మహారాజున కభిముఖుడై “స్వామీ! ఈతనిచరిత్రము నాకు సందేహాస్పదముగ నున్నది. దేవర వారును యోజింపవలె” ననెను. ఆ మాటలువిని భీమసింగుతో దేవా! ఈ బాలుని మాటలు నమ్మి నాపై ననుమానపడఁ బోకుడు. నేను జేయఁ బోయెడి యుపకారము ముందుముందు నా కార్యములవలనే మీకు బోధపడును. అలాయుద్దీను యొక్క గుట్టుమట్లు నాదగ్గర నున్నందున నేను మీ రనాయాసముగఁ జక్రవర్తిని గెలుచునట్లు చేయఁగలను” అని మహరాష్ట్రుఁడు పలుక భీమసింగు సచ్చీలుండగుట చే ననుమానపడక వానికి నెలకు పదివరహాలు జీత మేర్పఱచి యుద్యోగమిచ్చెను. మహారాష్ట్రుని చమత్కారసంభాషణమున బాలుఁడైన లక్ష్మణసింగు వాని యెడల ననురాగము గలిగియుండెను. మదనసింగు కేలనో కాని వసంతభట్టు చూపులును, రూపును జూచినవెనుక నాతనియం దని