పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

హేమలత

స్థానదండయాత్రను గూర్చి యత్యంత రహస్య మయిన కాగితములు గూడనాకు లభించినవి. అవియన్నియు నేను మీకు నిచ్చెదను. అప్పుడు నాసత్ప్రవర్తనమును మీరెఱుఁగలరు. ఇక నేను సెలవుగైకొనిపోయివచ్చెద నని ఖాను చెప్పిన నలాయుద్దీ నాశ్చర్యమును సంతోషమునుగుదురఁజల్లని కటాక్ష వీక్షణములు వానిపైఁ బఱపుచు నీకు లభించిన కాగితముల నీరాత్రితెచ్చి మారుఁ జూపవలయును. ఆకాగితములఁ జూచినగాక మాకుఁ దోఁచదు. నీవతివేగ మేగి వానిని దీసికొనిరమ్మని చక్రవర్తి పలుక మందహాసముతో సెలవుగైకొని బసకు బోయెను.