పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

37

వృద్ధుఁడు భయపడి నాయనా నీవెవరు? నాసంగతి బయలబెట్టకుము అని బతిమాలుకొనెను. గోసాయియు వృద్ధుని హస్తమును బట్టుకొని నేనెవ్వరయిన మీకెందుకు? నాసంగతి ముందుముందెఱుఁగఁగలరు. నాప్రాణములమీద మీకు నమ్మకముగలరేని మీరహస్యము నేను బయలుపఱుపనని ప్రమాణము చేయుచున్నాను భయపడకుఁడు. నేనింక నిటనుండరాదు” అని చెప్పి వారివలన సెలవుగైకొని గోసాయి యరిగెను. ఆ దినమున గోసాయి గోవిందశాస్త్రి యింట విందారగించి యా గ్రామమునే యుండెను.

ఆనాఁటి సాయంకాలమున పాలికోటలో నొక విధమయిన కళవళము పుట్టెను. అక్కడనుండి కన్నులార నది చూచినవారికే కాని యన్యులకుఁ దెలియదు. దీపములు పెట్టినతోడనే రహిమాను తాను సాధారణముగ యుద్ధరంగమునకుఁబోవు సమయములయందు దాను ధరించు వస్త్రములను, గవచమును, ఖడ్గమును ధరించుకొని తన యధికారము క్రిందనున్న రాజభటు లందరునట్లు కలహ సమయానుకూలమగు వేషముల ధరింపవలెనని యాజ్ఞాపించెను. అట్లు సర్వప్రయత్నములు జరిగించి రాజభటసమేతుఁడయి ముష్కరుఁడగు నాతురుష్కుఁడు రెండజాముల రాత్రియైన వెనుక గ్రామమంతయు నిశ్శబ్దముగ నున్నపుడు వృద్ధుఁడు నివాసము చేయుచున్న మఠమును జుట్టవైచి లోపలి వారిని పిలువుమని సేవకులలో నొకనిని నాజ్ఞాపించెను. అతఁడును బావాజీ అని పిలువ రోగపీడితులెవరో యాపదలో నుండి వచ్చినారని విసుగుగొనక తడవికొనుచు లేచివచ్చి తలుపుఁదీసెను. వెంటనే నిర్దయాత్ముఁడగు కఱకు తురక డెబ్బది సంవత్సరముల ప్రాయము