పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/24

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

23

యని రోదన మారంభించెను. ఈ వృత్తాంతము సవిస్తరముగ నాలకించిన తోడనే సాహేబునకు మహాకోపమును భయమును నాశ్చర్యమును నేక కాలమున జనియింప గదియదాఁక మాటాడలేక కొయ్యవలెనుండెను. తుదకు ధైర్యముఁ దెచ్చుకొని “యౌరా! యెంతపని చేసితిరి. కొంప మునిగినిది. పాడుముండకొడుకులు మీరొకకార్యము చక్కఁజేయఁగలరా? అయ్యయ్యో! వారు చక్రవర్తికడకు రాయబారము దెచ్చిన రాజపుత్రకుమారుడు మొదలగు వారు ఈ గ్రామమున వారిప్పుడున్నారు. వారిలో మన నాజరుజంగుగూడ నున్నవాఁడు. నావిషయమై యతఁ డెఱఁగును. చక్రవర్తితో సంభాషింపకమానఁడు. హా మౌలాఅల్లీ! హా మహ్మద్! ఈగండముగడిచిన యెడల నూఱుగురు ఫకీరులకు సన్నముఁ బెట్టించెదను అని ధైర్యము వదలి పిఱికి స్వభావముగలవాఁ డగుటచే సేవకులనిందింపఁదొడంగెను. అప్పుడు గులామల్లి గడగడవడఁకుచుఁ దనయేలిక పాదముల పైఁబడి మేమది యెఱుఁగక గోతిలోఁ బడినాము. మహాప్రభూ! మీగులాపు వాండ్రను రక్షింపవలయునని స్వామిని బ్రార్థించెను. తర్వాత ధైర్యముఁదెచ్చుకొని ఖాను తదనంతర వృత్తాంతము నెఱిగింపుఁడని వారల నడుగ నందుఁడు నోట మాటాడక నొక సంచిని దెచ్చి యందుండి యొక కాగితములకట్టను బైటకుఁ దీసి, “మహాప్రభూ! ఇది యమునాతీరమున దేవాలయమువద్ద మాకొక యోగి దగ్గఱ లభించినది. వానిని గటతేర్చి యిది తెచ్చినాము. ఏలినవారు చిత్తగింపవలెను అని చేతి కందించెను. ఆతఁ డాకాగితముల నందుకొని దీపముఁ దెప్పించి వానిని జక్కగఁ జదివి పరీక్షించినపు డందు మిగుల రహస్యమగు కాగిత మొకటి కనఁబగుటచే విచారసమేత మగు ఖానుమొగము మందహాసముతో వికసించెను. నూతనముగ సంభవించిన యీకాగితములయందు దాను