పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/132

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

131

వద్దకు బరుగెత్తి విచారముతో “స్వామీ! మోసము! మోసము జరిగినది” అని యఱచెను.

అల్లాయుద్దీనులికిపడి లేచి యది యెట్టిదని యడుగ ఖాను తొందరతో నిట్లు చెప్పెను. “మహాప్రభూ! పల్లకులలోఁ గూర్చుండి వచ్చినవారు స్త్రీలు కారు. ఒక్కొక్క పల్లకియం దొక రసపుత్ర శూరుఁడు కూర్చుండెను. పల్లకుల మోయువారందఱు రసపుత్ర సిపాయిలేకాని బోయలుకారు. వారు బోయలవేషముల దాల్చి పల్లకులలో సాయుధముల దెచ్చి కొన్నారు. మన సైనికు లశ్రద్ధగనున్నందున మన మీదినమున నోడిపోదుము. భీమసింగు పల్లకిలో గూర్చుండి కోటకుఁ బాఱిపోవుచున్నాఁడు. నే నాతని నాపఁజాల నైతిని” అని ఖాను విన్నవించుచుండఁ జక్రవర్తి నిశ్చేష్టితుడై కొంతసేపటి కొడలెఱిఁగి రాజపుత్రులు త్రవ్విన మహావిపత్సముద్రమునఁబడి తానును దన సైనికులును మృతినొందవలసి వచ్చెనని చింతించి ధైర్యమును దెచ్చికొని “హా మౌలా ఆల్లీ! హా ముహమ్మద్! హా హుస్సేన్! హుస్సేన్! అరే నాజరుజంగ్! అరే అరే అల్లా అల్లా అల్లా అయ్యో! పరుగెత్తి భీమసింగును దఱిమి పట్టుకొనిరండు. అయ్యో! పద్మినీ! పద్మినీ! పట్టికొండు. సిపాయిలు లేచి యుద్ధసన్నద్ధులుగండు.

ఓయీ! ఇబ్రహీం, ఓయీ! జహందర్, లెండి లెండి. అరే జోహారుల్లా త్వరపడు అని యఱవజొచ్చెను. ఈలోన మునుపటి స్థలమున దాగియున్న రాజుపుత్రశూరులు భటసమేతముగ నాలుగు వేల తొమ్మిది వందల మందియు నొక్కసారిగ హుమ్మ నివచ్చి యశ్రద్ధగనున్న మ్లేచ్ఛ సైన్యమును దాఁకిరి. అతి త్వరితముగలేచి మహమ్మదీయ సైనికులు తమ తమ ఆయుధ