పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/127

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

హేమలత

నొక త్రాట విఱచికట్టి పాదముల బొటనవేళ్ళను గూడబంధించిరి. అప్పుడు మదనసింగు మనస్సున నీశ్వర ధ్యాన మొనర్చు చుండెను. “ఇపుడైన జక్రవర్తి మాట విందువేని నిన్ను రక్షించెదను, అట్లు చేసెదవా? యని రహిమాన్ ఖాన్ నడుగ నిర్భయముగనతడు నేనట్లు చేయను. నీ యిష్టము వచ్చినట్లు చేయుము అని యుత్తరమిచ్చెను. అపుడు వారినుపకర్రను గన్నుల దగ్గఱకు దెచ్చునప్పటికి వెనుక నుండి యొక సేవకుడఱచుచు వచ్చి నిలువుడు! నిలువుడు చంపవద్దని కేక వైచెను. ఆ మాటలు విని రహిమాన్ ఖాన్ తిరిగిచూచి యామనుష్యు డెవ్వడని యఱచుచుండ నతడొక సాహేబుతో వధ నాపలసినదనియు జక్రవర్తి ఖాన్ ను రమ్మనియెను. అని చెప్పెను. ఆ ఘోరకృత్యము నాపి ఖాను మదనసింగు బంధములను విప్పించి చక్రవర్తి గుడారమున కరిగెను. చక్రవర్తి యెదుట రసపుత్రుడొకడు కూర్చుండెను. ఖాన్ ను జూచినతోడనే చక్రవర్తి రసపుత్రుని వంక దిరిగి రాయబారము విశదీకరింపుమని కోరెను. రాయబారములు నడుపుటయందు మిగుల నేర్పుగల దుర్గసింగు చక్రవర్తితో నిట్లనియె. “అయ్యా! నారాయణుయు శ్రీపద్మనీ దేవియు విన్నవింపుమన్న సంగతులను నేను మీతో మనవి చేయుచున్నాను. భీమసింగును మీరు చెఱనుండి విడిపింతురేని పద్మినీదేవి మీ భార్యయై యుండుట కొప్పుకొన్నది. భర్త ప్రాణరక్షణమునకును, దనకాయమునైన సమర్పింపదలచి పద్మిని మీ సాంగత్యమునకు సమ్మతించినది అని దుర్గసింగు విన్నవింప జక్రవర్తి యమితానంద పరవశుడై యఱచి పీఠమునుండి లేచి రహిమాన్ ఖాన్ ని గౌగలించుకొని దుర్గసింగును మెచ్చికొనెనును. అంతట దుర్గసింగు మరల “ఆ పద్మినితో గూఁడ మానగరమునందు గల గొప్ప