ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యనీయుల ఆశీర్వచనములు


గంటి లక్ష్మీనారాయణమూర్తి

B.Sc, B.Ed, CAIIB, IR & PM

బెంగుళూరు.

మాన్యమిత్రులు డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తిగారు విశాఖపట్నములో 1975 నుండి నాకు పరిచయస్తులే కాకుండా, సగోత్రీకులు, సన్నిహితులు, సోదరులు, ముఖపుస్తక మిత్రులు కూడాను.

1975 లో విశాఖపట్నం, అఫీషియల్ కాలొనీలో వారి తండ్రిగారు కీ.శే. నారాయణమూర్తి గారి నివాసగృహము ఉండెడిది. వారు రామభక్తులు, సత్పురుషులు. వారి సుపుత్రుడు మన డాక్టరు. నరసింహమూర్తి గారు. వారింటి ప్రక్కనే నేను కొత్తకాపురము పెట్టడానికి ఒక గది అద్దెకు తీసుకున్నాను. డాక్టరు. నరసింహమూర్తి గారు మా కుటుంబానికి వైద్య సహకారాలు అందించే వారు. వారితో మాకు సాన్నిహిత్యము ఏర్పడింది. డాక్టర్. గన్నవరపు నరసింహ మూర్తి గారు శస్త్రవైద్యములో నైపుణ్యులై అమెరికాలో స్థిరపడిన తర్వాత ముఖ పుస్తకములో నా ముఖము గుర్తుపట్టి మరల మా స్నేహాన్ని పునరుద్ధరించారు.

డాక్టరు. నరసింహమూర్తిగారు నిరంతర వైద్యసేవయే కాక సాహిత్య సేవ కూడా చేస్తున్నారు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో కలం పట్టిన సవ్యసాచి వారు. వారి వైద్యవిజ్ఞానము దేహానికి ఆరోగ్యము చేకూరుస్తే, వారి పద్యరచనా నైపుణ్యము మానసికానందాన్ని చేకూరుస్తుంది. వారి వృత్తివిద్య అయిన వైద్యము అన్నివిధాల ప్రజలకు, ముఖ్యముగా తన జన్మభూమికి ఉపయోగపడాలని, మాతృ భాషకు సేవచెయ్యాలని, తేటతెలుగు మాటలతో నలభైకి పైగా వ్యాసములు