ఈ పుట ఆమోదించబడ్డది

6. గళగ్రంథి ఆధిక్యత

(Hyperthyroidism)

గళగ్రంథి:

గళగ్రంథి (Thyroid) కంఠము ముందర స్వరపేటిక, శ్వాసనాళములను ఆనుకొని సీతాకోక చిలుక ఆకారములో ఉంటుంది. ఈ గ్రంథికి కర్ణికలు (lobes) రెండుప్రక్కలా ఉండి ఆ రెండు కర్ణికలను కలుపుతూ నడిమిన సంధానము. (Isthmus) ఉంటుంది. వయోజనులలో యీ గళగ్రంథికర్ణిక పరిమాణము 5 సె.మీ ఎత్తు, 3 సె.మీ వెడల్పు 2 సె.మీ మందము గలిగి ఉంటుంది. గళగ్రంథి స్రావకములు, థైరాక్సిన్ (Thyroxine, T-4), ట్రై అయిడో థైరొనిన్ (Triidothyronine, T-3), కణజాలముల జీవవ్యాపార క్రియకు (metabolism) దోహదకారిగా ఉంటాయి. శిశువుల వృద్ధికి, మనోవికాసమునకు కూడా థైరాక్సిన్ తోడ్పడుతుంది. జంతుజాలములో విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము (Basal metabolic rate) గళగ్రంథి స్రావకములపై ఆధారపడి ఉంటుంది. గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి ఎక్కువయితే గళగ్రంథి ఆధిక్యత (Hyperthyroidism) కలిగి ఆ లక్షణాలు పొడచూపుతాయి.

గళగ్రంథి స్రావక ఆధిక్యత లక్షణాలు:

గళగ్రంధి స్రావకములు ఎక్కువయినప్పుడు జీవవ్యాపార ప్రక్రియ (metabolism) ఎక్కువ అగుటయే కాక, వాటి ప్రభావము వలన సహవేదన నాడీమండలము (Sympathetic nervous system) ప్రేరేపించబడి ఆ లక్షణములు కూడా అధికము అవుతాయి. నీరసము, శరీరపు బరువు తగ్గుట, ఆకలి పెరుగుట, గుండెదడ, గుండె వేగము పెరుగుట, మానసిక ఆందోళన, గాభరా, చిరాకు, హస్త కంపనములు (tremors), ఎక్కువ చెమట పట్టుట, కండరముల సత్తువ తగ్గుట, విరేచనములు, నిద్ర పట్టకపోవుట, ఉష్ణమును తట్టుకోలేకపోవుట, స్రీలలో ఋతుస్రావము మందగించుట (Oligomenorrhea) పొడచూపుతాయి. వృద్ధులలో హృదయ కర్ణికల ప్రకంపనము

67 ::