ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదలపెట్ట వ చ్చు. వృద్ధులలోను, హృద్రోగులలోను తక్కువ మోతాదు (దినమునకు 25 మైక్రోగ్రాములు) మొదలుపెట్టి ప్రతి మూడు, నాలుగు వారములకు మోతాదును క్రమేణా పెంచుతు అవసరమైన మోతాదు సమకూర్చాలి.

లీవోథైరాక్సిన్ ని దినమునకు ఒక్కసారి యిస్తే సరిపోతుంది. పరగడుపుతో యీ మందును సేవించి మరి యే యితర మందులు మరొక రెండుగంటల వఱకు తీసుకొనకూడదు. అయనము (iron), కాల్సియం, అల్యూమినియం మృదుక్షారకములు, సుక్రాల్ఫేట్, కొలిస్టెరమిన్ వంటి మందులు లీవోథైరాక్సిన్ గ్రహణమునకు (absorption) అంతరాయము కలిగిస్తాయి.

గళగ్రంథి ప్రేరేపక (TSH) పరీక్ష ఆరు వారములకు ఒకసారి చేస్తూ మందు మోతాదును సరిదిద్దవచ్చును. లీవోథైరాక్సిన్ మోతాదు స్థిరపడ్డాక, సంవత్సరమునకు ఒకసారి పరీక్ష సలుపుతే చాలు.

66 ::