ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరుదైన పరిస్థితులలో దీనిని వాడుతారు. ట్రైగ్లి సరై డుల ఆధిక్యము (Hyper triglyceridemia) :

రక్తములో ట్రైగ్స లి రైడులు 200 మి.గ్రాములు మించితే చికిత్స అవసరము. బరువు తగ్గుట, వ్యాయామము పెంచుట, మద్యము వినియోగము మానుట, మితాహారము, మధుమేహవ్యాధిని అరికట్టుట, వంటి జీవనశైలి మార్పులు ట్రైగ్లిసరైడులను తగ్గించుటకు తోడ్పడుతాయి.

నయాసిన్ (niacin), ఫిబ్రేటులు (fibrates), జెంఫైబ్రొజిల్ (gemfibrozil), ఒమెగా - 3 వసామ్లములు (omega-3 fatty acids) జీవనశైలి మార్పులతో తగ్గని ట్రైగ్లిసరైడులను తగ్గించుటకు వాడుతారు.

57 ::