ఈ పుట అచ్చుదిద్దబడ్డది

and Testosterone) ఉత్పత్తికి, కొలెష్ట్రాలు అవసరమే. కొంత కొలెష్ట్రాలు ఆహారము వలన సమకూడినా, కాలేయములోను, వివిధ కణములలోను ఉత్పత్తి జరిగి కూడా కొలెష్ట్రాలు రక్తములోనికి ప్రవేశిస్తుంది. పైత్యరసము ద్వారా కొంత కొలెష్ట్రాలు ప్రేవులలోనికి చేరినా, అందులో చాలా భాగము చిన్నప్రేవులద్వారా  గ్రహించబడి తిరిగి కాలేయమునకు చేరుతుంది. రక్తములో కొలెష్ట్రాలు ఎక్కువయితే అది ధమనీ కాఠిన్యమునకు దారితీస్తుంది. ట్రైగ్లి సరై డులు ( Triglycerides ) :

గ్స లి రాలుతో (Glycerol) వసామ్లములు (Fatty acids) సంయోగము చెందుట వలన ట్రైగ్లిసరైడులు అనే క్రొవ్వు పదార్థాలు ఏర్పడుతాయి. మనము తినే కొవ్వుపదార్థాలలో యివి ఉంటాయి. శరీరములో కూడా ఉత్పత్తి అవుతాయి. శరీరమునకు శక్తి చేకూర్చడానికి  ఇవి ఉపయోగపడుతాయి. అవసరానికి మించిన కొవ్వులు శరీర అవయవములలోను, కొవ్వుపొరలలోను నిలువ ఉంటాయి. రక్తములో ట్రైగ్లిసరైడుల ప్రమాణము పెరుగుతే అవి ధమనుల బిరుసుతనానికి తోడ్పడుతాయి. లై పోప్రోటీనులు (Lipoproteins)

కొవ్వుపదార్థములు నీటిలో కరుగవు. వాటికి జలవికర్షణ (Hydrophobia) ఉండుటచే రక్తములో ఎపోప్రోటీనులనే (Apoproteins) వాహక మాంసకృత్తులతో కలిసి అవయవాలకు కణజాలానికి కొనిపోబడుతాయి. ఆ మాంసకృత్తులు, కొవ్వుల సంయోగములను లైపోప్రోటీనులు (lipoproteins) అంటారు. ఈ లైపోప్రోటీను నలుసులులో కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు, యితర కొవ్వులు లోపల నిక్షేపమయి ఉంటే, వాటిని ఆవరించి ఒక ఫాస్ఫోలైపిడు, కొలెష్ట్రాలుపొర ఎపోప్రోటీనులతో ఉంటుంది. ఈ ఫాస్ఫోలైపిడులకు జలాపేక్షక (Hydrophilic) ధ్రువములు వెలుపలి వైపును, జలవికర్షణ (Hydrophobic) ధ్రువములు లోపలివైపున ఉంటాయి. అందువలన లైపోప్రోటీనులు రక్తముతో కలిసి అవయవములకు చేర్చబడ గలుగుతాయి. 1)

ఈ లైపోప్రోటీనులను  సాంద్రత బట్టి ఐదు తరగతులుగా విభజిస్తారు.

ఖైలోమైక్రానులు, (Chylomicrons)  వీనిలో 90 శాతము ట్రైగ్స లి రైడులు,

52 ::