ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నా నోటి ద్వారా మందులు అవసరము.

గ్రైసియోఫల్విన్ (Griseofulvin) దినమునకు 500 మి.గ్రా. నుంచి ఒక గ్రాము వఱకు రెండు మూడు వారములు వాడితే ఫలితములు కనిపిస్తాయి. టెర్బినఫిన్ (Terbinafine) దినమునకు 250 మిల్లీ గ్రాములు గాని, ఇట్రాకొనజోల్ (Itraconazole) దినమునకు  200 మి.గ్రాలు  గాని రెండు మూడు వారములు వాడినా సత్ఫలితములు కలుగుతాయి.

తాపప్రక్రియ (inflammation) అధికముగా ఉన్నపుడు తాపమును తగ్గించుటకు  శిలీంధ్రనాశకములతో పాటు ప్రెడ్నిసోన్ (Prednisone) 40 మి.గ్రాలు దినమునకు మొదలుపెట్టి క్రమేణా వైద్యుల పర్యవేక్షణలో  తగ్గిస్తూ మానివేయాలి. శిలీంధ్రనాశకములను నోటి ద్వారా ఎక్కువ దినములు వాడినపుడు రక్తకణ పరీక్షలు, కాలేయవ్యాపార పరీక్షలు నెలకు ఒకసారైనా చేయించుకొవాలి.

సోబి ; సుబ్బెము (Tinea versicolor : Pityriasis versicolor):

సోబి లేక సుబ్బెముగా వ్యవహారములో ఉన్న వ్యాధి మలస్సీజియా ఫర్

409 ::