ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నుంచి 18 సంవత్సరముల వారు, 50 సంవత్సరములు నిండినవారు, ఫ్లూ కాలములో గర్భిణీస్త్రీలు, ఫ్లూ కాలములో గర్భము దాల్చబోయే స్త్రీలు, ఉబ్బస, మధుమేహము, శ్వాసకోశపు వ్యాధులు, హృద్రోగములు వంటి ఇతర వ్యాధులు ఉన్నవారు, ఆరోగ్య విధులలో పనిచేసేవారు టీకాలు వేసుకొనుట మేలు.

వ్యాపక జ్వరాలు ఉన్నవారికి దూరముగా ఉండుట, స్పర్శ, కరచాలనములు  పాటించక పోవుట వలన, నోరు ముక్కులపై కప్పులను (masks) ధరించుట వలన, చేతులను తఱచు శుభ్రము చేసుకొనుట వలన, నోరు, ముక్కు, కనులు, ముఖములపై చేతులను చేర్చకపోవుట వలన వ్యాపక జ్వరములను కొంతవఱకు నివారించ గలుగుతాము.

దగ్గు, తుమ్ములు ఉన్న వారు మోచేతిని గాని ఆచ్ఛాదనములను (masks)  కాని నోటికి, ముక్కుకి అడ్డుపెట్టుకొని దగ్గుట, తుమ్ముట చేస్తే తుంపరలను వ్యాప్తి చేయరు.

382 ::