ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముట్టుకొన్నా, వ్యాధిగ్రస్థులను  కరచాలనములతోనో మరోలాగో తాకి పిదప ముక్కు, నోరు, స్పర్శించినా అవి ముక్కు, గొంతు, శ్వాస నాళముల శ్లేష్మపుపొర (Mucosa) లోని కణముల లోనికి ప్రవేశిస్తాయి. ఆపై త్వరగా ఆ కణములలో వృద్ధిచెందుతాయి. ఈ విషజీవాంశములచే ఆక్రమించబడిన కణముల నుంచి ఖీమోకైన్లు ( chemokines ), సైటోకైన్లు (cytokines) విడుదలయి  తాప ప్రక్రియను కలిగిస్తాయి. ఈ విషజీవాంశములు 32 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఒద్ద వృద్ధి చెందుతాయి. ఆ ఉష్ణోగ్రత ముక్కు, గొంతుక, శ్వాసనాళములలో ఉండుట వలన ఆ భాగములే తాప ప్రక్రియకు గురి అవుతాయి. నాసికా విషజీవాంశములు ( Rhinoviruses ) కణ విధ్వంసమును కలుగజేయవు. రెస్పిరేటరీ సిన్ సీషియల్ విషజీవాంశముల వలన శ్లేష్మపుపొర కణముల విధ్వంసము జరుగవచ్చును.

జలుబు కలిగించే విషజీవాంశములు చాలా త్వరగా మనుజుల మధ్య వ్యాప్తిచెందుతాయి. పాఠశాలలలోను, దినసంరక్షణ కేంద్రాలలోను పిల్లల నుంచి పిల్లలకు జలుబు ఎక్కువగా వ్యాప్తి చెంది, పిల్లల నుంచి పెద్దలకు సంక్రమించగలదు. కుటుంబములో ఒకరి నుంచి మరి ఒకరికి, కచేరీలలోను, కర్మాగారములలోను, పనిచేసేవారిలో ఒకరినుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శీతాకాలములలోను, ఆకురాల్చు కాలములోను, జలుబులు ఎక్కువగా కలుగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి ముక్కు ఉష్ణోగ్రత ఈ విషజీవాంశముల వృద్ధికి దోహదపడుట, వ్యక్తుల వ్యాధినిరోధక శక్తి తగ్గుట దానికి కారణము కావచ్చును. వ్యాధి లక్షణములు :

మనలో అందఱికీ జలుబు ఎప్పుడో అప్పుడు కలుగుట వలన లక్షణాలు అందఱికీ అనుభవవేద్యమే. ముందుగా గొంతు నొప్పి, ముక్కు, గొంతుకలలో దుఱద, ఒంటినొప్పులు, నలత, జ్వరభావము కలిగి, ఆపై ముక్కు కారుట, తుమ్ములు, దగ్గు, ముక్కు దిబ్బకట్టుట కలుగుతాయి. తలనొప్పి కొందఱికి కలుగుతుంది.  పిల్లలలో జలుబుతో   జ్వరము తఱచు

373 ::