ఈ పుట అచ్చుదిద్దబడ్డది

lacyclovir), ఫామ్ సైక్లొవీర్ (famciclovir) లలో ఏ మందైనా వ్యాధి లక్షణములు పొడచూపిన 48- 72 గంటలలో మొదలుపెడితే వ్యాధి తీవ్రతను, వ్యాధి కాలపరిమితిని తగ్గించగలుగుతాము. ఎసైక్లొవీర్ దినమునకు ఐదు పర్యాయములు వాడాలి. వాలసైక్లొవీర్, ఫామ్ సైక్లొవీర్ లను దినమునకు మూడు పర్యాయములు వాడాలి. వ్యాధితీవ్రత హెచ్చుగా ఉన్నవారిలోను, యితర సమస్యలు కలిగినపుడు సిరలద్వారా వాడుటకు ఎసైక్లొవీర్ లభ్యము. అగ్గిచప్పి తరువాత కలిగే నాడీ వ్యధకు (Post herpetic neuralgia) గాబాపెంటిన్ (Gabapentin), ప్రీగాబలిన్ (Pregabalin) లను, నొప్పి మందులను వాడవచ్చును. వ్యాధినివారణ :

అగ్గిచప్పికి టీకాలు లభ్యము. ఇవి వ్యాధిని చాలా శాతముమందిలో నివారిస్తాయి. టీకాలు తీసుకొన్నవారిలో వ్యాధి పొడచూపినా వ్యాధి తీవ్రత పరిమితముగా ఉంటుంది.

371 ::